Alumni Association: బాల్య మిత్రులు  37 ఏళ్ల తర్వాత కలిశారు

నల్లగొండ: ఒకటి కాదు రెండు కాదు 37 ఏండ్ల తర్వాత కలిశారు ఆ బాల్య మిత్రులు.. పాత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. నువ్వేం చేస్తున్నారు.. మీకు కుటుంబ నేపథ్యం ఏంటీ.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఇలా యోగ క్షేమాలు తెలుసుకున్నారు. చిన్నపుడు చేసిన చిలిపి జ్ణాపకాలను పంచుకున్నారు. భవిష్యత్ పై ఆశలు.. ప్రణాళికలు వేసుకున్నారు..నల్లగొండ జిల్లా కేంద్రంలోని గీత విజ్ణాన్ ఉన్నత పాఠశాలకు చెందిన 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం..సోమవారం (జూన్ 24) ఇబ్రహీంపట్నం లోని సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్స్ లో జరిగింది. బాల్య మిత్రులంగా చిన్నపిల్లల్లా కలిసిపోయి ఆట పాటలతో సందడి చేశారు. 

దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరడంతో సందడి సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్స్ లో సందడి కనిపించింది. పాఠశాలలో చదువుకున్న సందర్భంలోపాత జ్ణాపకాలు గుర్తు చేసుకుంట సరదాగా గడిపారు బాల్య మిత్రులు. ఒకరినొకరు పలకిరించుకొని వారి జీవన స్థితిగతులు, గత అనుభవాలు, మరువలేని జ్ణాపకాలను మరోసారి గుర్తు చేస్తుకుంటూ ఆడిపాడారు మిత్రులంతా. చిన్న పిల్లల్లా మారి సందడి చేస్తూ రోజు మొత్తం ఆటపాటలతో గడిపారు.